
*99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం*
*సర్పంచ్ మధు – ఉప సర్పంచ్ అమృత*
*మందమర్రి * (*మన ప్రజావాణి*) *ఏప్రిల్:2*
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీ లో ప్రజా పాలన _ ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యచరణ ప్రణాళికల లో భాగంగా, పొన్నారం గ్రామపంచాయతీ ఆఫీస్ లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంచాలా మధు, ఉప సర్పంచ్ పెంచాలా అమృత, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, గ్రామ వార్డ్ సభ్యులు. *పెద్ద సంఖ్యలో గ్రామ ఉపాధి హామీ కూలీలు హాజరయ్యారు* రైతులు ,మహిళలు ,యువత, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,గ్రామ సంబంధిత అధికారులు, మేధావులు తదితరులు గ్రామ సభకు హాజరయ్యారు. పోన్నారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ గ్రామ సభలో గ్రామ సమస్యల పై చర్చించుకోవడం జరిగింది. గ్రామ సమస్యలపై గ్రామ సర్పంచ్ పెంచాల మధు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా చూస్తానని పొన్నారం గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు..