prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 11:52 am Digital Edition : VIJAYKUMAR SIDDIPET

తన పట్టా భూమి కబ్జా చేశాడని తాహసిల్దార్ కు ఫిర్యాదు

తనకు న్యాయం చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి కంసాని రాజిరెడ్డి.

సిద్దిపేట,హుస్నాబాద్, మార్చి 27, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట రామవరం గ్రామంలో కంసాని రాజిరెడ్డి భూమిని 264 బీలో గల తన భూమిని ఎడుమల రాజిరెడ్డి తండ్రి బాల్ రెడ్డి అనే వ్యక్తి భూమిని కబ్జా చేశాడని స్థానిక తహసీల్దార్ కి పిర్యాదు చేసినట్లు కంసాని రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా కావున రామవరం గ్రామంలో గ్రామంలో తన భూమి కొంత మేరకు అమ్ముకోగా తనకు సంబదించిన భూమిని కూడా కబ్జా చేశాడని పిర్యాదులో పేర్కొన్నారు.తనకు తెలువకుండా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని తమ సమస్య పరిష్కారమైన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలని తహసీల్దార్ ని వినతిపత్రంలో కోరారు.స్థానికముగా మొఖాపై గ్రామంలో విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని తన భూమి తన ఇప్పించాలని అధికారులను కోరారు.అక్రమంగా తన భూమి కబ్జా చేసిన ఏడుమల రాజిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.