రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని-   రాయపోల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. మెడికల్ ఆఫీసర్ అరెపల్లి లో ఫీల్డ్ విసిట్ లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా వీడియో కాల్ చేసి నిజనిర్ధారణ చేశారు. ఏదో ఒక సాకు చెబుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రోజు వారిగా ఆసుపత్రి సమయ వేళలు పాటించాలని ఎల్లపుడు...