9 సంవత్సరాల భూ సమస్యకు పరిష్కారం బెజ్జంకి తహసిల్దార్ శ్రీకాంత్ కీ బాధితుల కృతజ్ఞతలు

9 సంవత్సరాల భూ సమస్యకు పరిష్కారం బెజ్జంకి తహసిల్దార్ శ్రీకాంత్‌కు బాధితుల కృతజ్ఞతలు బెజ్జంకి, ఏప్రిల్ 7(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని గూడెం గ్రామంలో సర్వేనంబర్ 177,178,179.180,184,237,235,91,121,187,229,231,232,, 174 ,384,391 లో 63-18 ఎకరాలు గత 9 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు తహసిల్దార్ శ్రీకాంత్ శాశ్వత పరిష్కారం చూపారు. ఎల్‌పిఎస్ కింద ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన భూములపై మ్యుటేషన్ సర్వే ఆలస్యమవడంతో బాధితులు ఎన్నో సంవత్సరాలు అధికారులను ఆశ్రయించారు. కోర్టు తీర్పులు, ఉన్నతాధికారుల సూచనల...