prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 1:26 pm Digital Edition : RAJASHEKARREDDY

9 సంవత్సరాల భూ సమస్యకు పరిష్కారం బెజ్జంకి తహసిల్దార్ శ్రీకాంత్ కీ బాధితుల కృతజ్ఞతలు

9 సంవత్సరాల భూ సమస్యకు పరిష్కారం

బెజ్జంకి తహసిల్దార్ శ్రీకాంత్‌కు బాధితుల కృతజ్ఞతలు

బెజ్జంకి, ఏప్రిల్ 7(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని గూడెం గ్రామంలో సర్వేనంబర్ 177,178,179.180,184,237,235,91,121,187,229,231,232,, 174 ,384,391 లో 63-18 ఎకరాలు గత 9 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు తహసిల్దార్ శ్రీకాంత్ శాశ్వత పరిష్కారం చూపారు. ఎల్‌పిఎస్ కింద ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన భూములపై మ్యుటేషన్ సర్వే ఆలస్యమవడంతో బాధితులు ఎన్నో సంవత్సరాలు అధికారులను ఆశ్రయించారు.
కోర్టు తీర్పులు, ఉన్నతాధికారుల సూచనల మేరకు తహసిల్దార్ శ్రీకాంత్ తక్కువ సమయంలోనే రికార్డుల ఆధారంగా సర్వే నిర్వహించి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తహసిల్దార్‌తో పాటు గిర్దవర్, సర్వేయర్లు మరియు ఇతర అధికారులను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సంఘాల నాయకులు ఈ పరిష్కారంపై సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారుఈ కార్యక్రమంలో ఆర్.టి ప్రచార కమిటీ చైర్మన్ అండ్ ఫౌండర్ రాసూరు మల్లికార్జున్,మాజీ సర్పంచ్ మాంకాల బాలయ్య, రాకం రాజు,మోదుగుపల్లి రాజు,కొంపల్లి రాజు, మాంకాల బాబు మంకాల భూపేందర్ ఉప్పులేటి శ్రీనివాస్ మెరుగు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.