తిరుమలాయపాలెం, ప్రజావాణి:రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార,పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో రోడ్లు,...