8 గంటల పని కోసం,140వ మేడేను జయప్రదం చేయండి! సిఐటియు పిలుపు!!
తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) రైల్వే కోడూర్ సిఐటియు జనరల్ బాడీ సమావేశం సోమవారం సాయంత్రం పి జాన్ ప్రసాద్,అధ్యక్షతన,కోడూరు సిఐటియు ఆఫీసులో జరిగినది.ఈ సమావేశానికి,సిఐటియు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు,సిహెచ్ చంద్రశేఖర్,ఆర్ వెంకటేష్,ముఖ్య అతిథులకు హాజరయ్యారు.వారు మాట్లాడుతూ,అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని హక్కు కోసం కార్మికుల రక్త తరుపునతో ఎర్ర జెండా అండతో,1917 రష్యాలో కార్మిక విప్లవం జయప్రదం తర్వాత,భారతదేశంలో 1926లో కార్మిక సంఘా లు పోరాడి ఎనిమిది గంటల పని హక్కును సాధించుకున్నారని,తెలిపారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం,నాలుగు లేబర్ కోడులు...