హెచ్ పివి,టీకా -మీ బిడ్డ భవిష్యత్తుకు రక్షణ కవచం సిద్దిపేట జిల్లా, మార్చి 8, ప్రజావాణి మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ హైమావతి, సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో హెచ్ పి వి, టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 6 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని, జిల్లాలో ఉన్న 10,147 మంది 14 సంవత్సరాల బాలికలందరూ హెచ్‌ పి వి టీకా తీసుకునేలా...