prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 7:22 am Digital Edition : MEERASAHAB CHILUKUR

69వ ఎస్ జిఎప్ తెలంగాణ సాఫ్ట్‌బాల్ అండర్–14 రాష్ట్ర స్థాయి పోటీలకు కోదాడ క్రీడాకారుల ఎంపిక

కోదాడ మార్చి07(ప్రజావాణి):స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (ఎస్ జిఎప్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 69వ సాఫ్ట్‌బాల్ అండర్–14 రాష్ట్ర స్థాయి బాలుర టోర్నమెంట్ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో మార్చి 8, 9 తేదీలలోజరగనుంది.ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు కోదాడకు చెందిన క్రీడాకారులు షేక్ అనస్, షేక్ రిషాన్, షేక్ మికాయిల్ ఎంపికైనట్లు కోచ్ సిద్ధిఖ్ తెలిపారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మహమ్మద్ సలీం షరీఫ్ క్రీడాకారులను అభినందించారు. ఒలింపిక్స్ క్రీడలలో ఒకటైన సాఫ్ట్‌బాల్ క్రీడలో కోదాడకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.రాబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చేసి జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు ఫిట్నెస్ పట్ల చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని పేర్కొంటూ, వారు లక్ష్యాన్ని సాధించాలని మనసారా ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్, కార్యదర్శి ఉస్మాన్ ,డాక్టర్ నందకిషోర్ , డాక్టర్ చైతన్య, డాక్టర్ దిలీప్, డాక్టర్ నరసింహారెడ్డి,సభ్యులు ఖాజా మియా,తుమ్మల సురేష్, షేక్ మీరా , జబ్బార్, ఏడుకొండలు, అసోసియేషన్ సభ్యులు
బడుగుల సైదులు,నాయిని నాగేశ్వరరావు, శ్రీకాంత్, బాలరాజు, బుల్లయ్య, శ్రీను తదితరులు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.తల్లిదండ్రులు అతనిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Skip to PDF content

Skip to PDF content