సిరిసిల్లలో గాంధీ విగ్రహం కనిపించకుండా ప్లెక్సీలు… వివాదంగా మారిన వాసవి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందుల భయం రాజన్న సిరిసిల్ల / ప్రజావాణి సిరిసిల్ల పట్టణంలో రేపు ప్రారంభంకానున్న వాసవి వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం నేపథ్యంలో పట్టణమంతా భారీగా ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో విగ్రహం పూర్తిగా కనిపించకుండా పోయింది. జాతీయ నాయకుడి విగ్రహాన్ని...