prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 11:25 pm Digital Edition : SRIKANTH MULUGU

494 ఓట్లున్నా గతి లేదు – అభ్యుదయ కాలనీ దుస్థితి.

494 ఓట్లున్నా గతి లేదు – అభ్యుదయ కాలనీ దుస్థితి.

.ప్రజా ప్రభుత్వం ఇకనైనా స్పందిస్తుందా?
.అభివృద్ధికి నోచుకోని అభ్యుదయ కాలనీ.
.జిమ్మ జ్యోతి పోరాటం – పట్టించుకోని పాలకులు.
.బురదలో జీవనం – 30 ఏళ్లుగా నిర్లక్ష్యం.
ఓట్లు వేస్తే అభివృద్ధి రాదా? – కాలనీ వాసుల ప్రశ్న”*
.రోడ్లు లేవు, నీళ్లు లేవు – ఇదేనా ప్రజా పాలన?”*
.ఇకనైనా మేల్కొనండి – అభ్యుదయ కాలనీ ఆక్రందన.

గోవిందరావుపేట జులై26(ప్రజావాణి)

 

30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని అభ్యుదయ కాలనీ

494 ఓట్లున్నా పట్టించుకోని సర్పంచ్ – వార్డు సభ్యురాలు జ్యోతి ఆవేదన

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర గ్రామ 12వ వార్డు అభ్యుదయ కాలనీ గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది.

ఈ వార్డులో 494 ఓట్లు ఉన్నా కూడా కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వార్డు సభ్యురాలు జిమ్మ జ్యోతి గారు కాలనీ వాసుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నారు.

కమ్యూనిస్టు భావాలతో ప్రజల కోసం పోరాడుతున్న జ్యోతి గారు, సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్‌ను పలుమార్లు కోరినా స్పందించడం లేదని ఆరోపించారు.

రోడ్లు లేక, డ్రైనేజీ లేక, తాగునీరు లేక కాలనీ వాసులు నరకం అనుభవిస్తున్నారు.

ఎన్నికల సమయంలో మాత్రం హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాలనీ సమస్యలు అలాగే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఈ 30 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.