40 ఏళ్ల పత్రాలకు విలువ లేదా..? ఎల్లమ్మ ఆలయ భూమిపై గౌడ కులస్తుల న్యాయ పోరాటం
బెజ్జంకి, మే 09(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో గౌడ సంఘానికి చెందిన ఎల్లమ్మ ఆలయ భూమి వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. గ్రామ శివారులోని సర్వే నంబర్ 235లో ఉన్న 4.19 ఎకరాల భూమిని 30-12-1986న గ్రామ పెద్దల సమక్షంలో డబ్బులు చెల్లించి పత్రం రాయించుకున్నామని గౌడ కులస్తులు తెలిపారు. ఈ విషయానికి సంబంధించిన పత్రాలను ఆర్డీవో, కలెక్టర్‌కు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అప్పట్లో దాచారం గ్రామానికి చెందిన మంద రాజేశం గ్రామంలోని అన్ని కులాల పెద్దల...