276వ నిత్య పూలమాల కార్యక్రమం లో పాల్గొన్న కందకట్ల సందీప్ రెడ్డి
ఘట్‌కేసర్, జూలై 26 (ప్రజావాణి): ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో 276వ వారపు నిత్య పూలమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదులాబాద్ డివిజన్‌కు చెందిన కందకట్ల సందీప్ రెడ్డి హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కందకట్ల సందీప్ రెడ్డి మాట్లాడుతూ, గత 276 వారాలుగా ఎలాంటి విరామం...