నడికూడ మండలంలో కేటాయించిన విధులను ముందుగానే పూర్తి చేసిన బి.ఎల్.ఓలకు సన్మానం నడికూడ ప్రజావాణి, 31 జూలై: నడికూడ మండలంలో తమకు కేటాయించిన విధులను సమయానికి ముందుగానే సమర్థవంతంగా పూర్తి చేసి, ఆదర్శప్రాయ సేవలు అందించిన బూత్ లెవల్ ఆఫీసర్లు (బి.ఎల్.ఓలు)ను మండల రెవెన్యూ అధికారి మరియు మండల అభివృద్ధి అధికారి సన్మానించారు. ఈ సందర్భంగా కౌకొండ గ్రామానికి చెందిన ఎం.డి. కామ్రూన్ మరియు సర్వాపూర్ గ్రామానికి చెందిన మినుగు కల్పనలను శాలువాలతో సత్కరించి, వారి కృషికి గుర్తింపుగా ప్రశంసాపత్రాలు...