prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 11:06 am Digital Edition : NAVEEN NADIKUDA

నడికూడ మండలంలో కేటాయించిన విధులను ముందుగానే పూర్తి చేసిన బి.ఎల్.ఓలకు సన్మానం

 

నడికూడ ప్రజావాణి, 31 జూలై:

 

నడికూడ మండలంలో తమకు కేటాయించిన విధులను సమయానికి ముందుగానే సమర్థవంతంగా పూర్తి చేసి, ఆదర్శప్రాయ సేవలు అందించిన బూత్ లెవల్ ఆఫీసర్లు (బి.ఎల్.ఓలు)ను మండల రెవెన్యూ అధికారి మరియు మండల అభివృద్ధి అధికారి సన్మానించారు.

 

ఈ సందర్భంగా కౌకొండ గ్రామానికి చెందిన ఎం.డి. కామ్రూన్ మరియు సర్వాపూర్ గ్రామానికి చెందిన మినుగు కల్పనలను శాలువాలతో సత్కరించి, వారి కృషికి గుర్తింపుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.

 

బి.ఎల్.ఓలు తమకు అప్పగించిన బాధ్యతలను సమయపాలనతో, నిబద్ధతతో నిర్వహించడం ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు. వారి కృషి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవాభావంతో తమ విధులను కొనసాగించాలని ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సిబ్బంది మరియు బి.ఎల్.ఓలు పాల్గొన్నారు.