prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 10:56 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

24 గంటల్లోనే చోరీ కేసును ఛేదించిన పోలీసులు!

ధర్మపురిలో లత అనే మహిళ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని నుండి 2 తులాల బంగారం, 14 తులాల వెండి ఆభరణాలతో పాటు గతంలో దొంగిలించిన ద్విచక్ర వాహనాన్ని రికవరీ చేశారు. ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డిల పర్యవేక్షణలో సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్‌ఐ మహేష్ బృందం సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. వేగంగా స్పందించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.