తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు   మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్   ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీ బోనాల ఊరేగింపులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు   షాద్‌నగర్ పట్టణంలోని ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపులో భక్తులతో కలిసి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన...