prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 11:40 pm Digital Edition : GIRIBABU KONDHURG

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు

 

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

 

ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీ బోనాల ఊరేగింపులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు

 

షాద్‌నగర్ పట్టణంలోని ఫరూఖ్‌నగర్ యాదవ కాలనీలో నిర్వహించిన బోనాల ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపులో భక్తులతో కలిసి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల ఉత్సవాలను భక్తి, ఐక్యతతో నిర్వహించడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలు రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్లు పిల్లి శారద శేఖర్, గోపాల్, ఎస్పీ శివ, మాజీ కౌన్సిలర్లు వెంకట్రాం రెడ్డి, యుగంధర్, చిన్న యాదగిరి, నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, చీపిరి రవి యాదవ్, బిక్షపతి, చెర్క శివ, అశోక్, బాబా ఘోరీ, మహమూద్, నవీన్, సాయి, అభిలాష్, శ్రీనివాస్ తదితరులు, కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..