30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని అభ్యుదయ కాలనీ 494 ఓట్లున్నా పట్టించుకోని సర్పంచ్ - వార్డు సభ్యురాలు జ్యోతి ఆవేదన పసర:- గోవిందరావుపేట (ప్రజావాణి)   ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్ర గ్రామ 12వ వార్డు అభ్యుదయ కాలనీ గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ వార్డులో 494 ఓట్లు ఉన్నా కూడా కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వార్డు సభ్యురాలు జిమ్మ జ్యోతి గారు కాలనీ వాసుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నారు....