సచివాలయ ఉద్యోగి స్కాం: ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రైవేట్ కాలేజీలో పాఠాలు! వీడియోలతో బయటపడ్డ అసలు నిజం బద్వేల్:జూలై 24 ప్రజావాణి ప్రజలకు గడప దగ్గరే సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి తెచ్చిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను కొందరు ఉద్యోగులు గేలి చేస్తున్నారు. విధులకు గైర్హాజరై ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తూ ప్రభుత్వ జీతాన్ని దండుకుంటున్న దారుణం బద్వేల్‌లో వెలుగుచూసింది.బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని చింతల్ చెరువు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ప్రభుత్వ సాయి శ్రీ అగ్రికల్చర్ పై...