పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ‘అనస్థీషియా’ గ్రహణం: గర్భిణీలు, పేద రోగులకు తప్పని ప్రైవేటు నరకం.వైద్యాధికారులు, ప్రభుత్వం ఇకనైనా స్పందించేనా? పోరుమామిళ్ల జూలై 19 ప్రజావాణి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పాలకులు కోతలు కోస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పేద ప్రజలకు కనీస వైద్యం అందడం లేదు. కడప జిల్లాలోని ప్రముఖ వ్యాపార, భౌగోళిక కేంద్రమైన పోరుమామిళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యాశాల (గవర్నమెంట్ హాస్పటల్) ప్రస్తుతం తీవ్రమైన సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది.ఈ ఆసుపత్రి పరిసర ప్రాంతాల పేద ప్రజలకు,ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఒక శాపంగా మారింది....