రంగసముద్రం పంచాయితీలో బట్టబయలైన రెవిన్యూ, విద్యుత్ శాఖల అధికారుల నిర్వాకం: సర్వే నెంబర్ 415కు పర్మిషన్ తీసుకుని, 622 ప్రభుత్వ భూమిలో బోరు, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు! రంగసముద్రం: జూలై 10 ప్రజావాణి నిబంధనలను తుంగలో తొక్కి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కొందరు ప్రభుత్వ అధికారుల అండదండలతో రంగసముద్రం పంచాయితీలో ఒక భారీ భూ ఆక్రమణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక సర్వే నెంబర్‌లో అనుమతులు పొంది, ఏకంగా ప్రభుత్వానికి చెందిన మరో సర్వే నెంబర్ భూమిని ఆక్రమించి అక్కడ అక్రమంగా బోరుబావి, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సైతం...