ముఠాకోళ్ల అక్రమ దందా,తూకాల్లో మోసాలు,మరియు తీవ్ర అపరిశుభ్రత మధ్య పోరుమామిళ్ల మండలంలో చికెన్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వ్యాపారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోరుమామిళ్లలో విచ్చలవిడిగా నాణ్యతలేని చికెన్ విక్రయాలు – నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు! పోరుమామిళ్ల మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు చికెన్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా మారుతున్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు యథేచ్ఛగా నాణ్యతలేని చికెన్‌ను విక్రయిస్తున్నారు. నిత్యం వందలాది మంది కొనుగోలు చేసే...