కడప జిల్లా పోరుమామిళ్లలో నాణ్యత లేని చికెన్ విక్రయాలు.. అధికారుల తనిఖీలు, కఠిన చర్యల కోసం స్థానికుల డిమాండ్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో చికెన్ షాపుల నిర్వహణ, నాణ్యత ప్రమాదాల అంశంపై స్థానికుల నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని పలు చికెన్ దుకాణాలలో నాణ్యత లేని, బరువు తక్కువగా ఉన్న (చిన్న) కోళ్లను విక్రయిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, చాలా షాపుల పరిసరాలలో కనీస పరిశుభ్రత (నీట్‌నెస్) లేకపోవడం, వ్యర్థాలను బహిరంగంగా పారవేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతోందని, దీనివల్ల ప్రజారోగ్యానికి తీవ్ర...