టీడీపీ బలోపేతమే లక్ష్యంగా.. బద్వేల్ ఇన్‌చార్జిని కలిసిన చింతలపల్లి నాయకులు

పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి నాయకుల అభిప్రాయం కడప జిల్లా,బద్వేల్,నవంబర్ 29(ప్రజావాణి) బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి మంచూరి సూర్యనారాయణరెడ్డిని చింతలపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు,నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఏపీ స్టేట్ రోడ్డు డెవలప్‌మెంట్ డైరెక్టర్ సాధనకారి రంతు ఆధ్వర్యంలో చింతలపల్లి గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ గంధం భాస్కర్, ఉపసర్పంచ్ చెన్నయ్యతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు....