prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 9:19 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

సిద్దిపేట పేట జిల్లా మద్దూర్ మండల కుమ్మర్ల సంఘం నూతనకమిటి ఎన్నిక 

మద్దూరు నవంబర్29, ప్రజా వాణి,

(టి అర్ కె ఎస్)నడికుడ జయంత్ రావు నాయకత్వంలో. వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశము, ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్, కోశాధికారి ఆమంచి రాజలింగము గార్ల సూచనలతో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తరిగొప్పుల రామచంద్రం ఆధ్వర్యంలో  మద్దూరు మండల్ సర్పంచుల పోరం అధ్యక్షుడు మరియు సిద్దిపేట జిల్లా గౌరవ సలహాదారు శనిగరం సత్యనారాయణ సిద్దిపేట జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు నాగపురి రమేష్ ప్రధాన కార్యదర్శి  కొలీపాక శ్రీనివాస్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి యాదగిరి జిల్లా ఉద్యోగ విభాగం అధ్యక్షులు నార్లపురం రాములు వృత్తి విభాగం అధ్యక్షులు మూడపల్లి భూమయ్య , గజ్వేల్ మండల ప్రచార కార్యదర్శి కానుగుల విటల్, దూల్మిట్ట మండల ప్రధాన కార్యదర్శి వంగపల్లి సాదు వారి సమక్షంలో మద్దూర్ మండల కుమ్మర్ల సంఘం నూతన కమిటిని ఎన్నుకొన్నారు. మద్దూర్ కుమ్మర్ల మండల నూతన కమిటీ అధ్యక్షులుగా శనిగరం కనకయ్య, గౌరవ అధ్యక్షులు యసరేని కనకయ్య, ప్రధాన కార్యదర్శి: వంగపల్లి బిక్షపతి, కోశాధికారి : నాంపల్లి కనకయ్య, ఉపాధ్యక్షులు : తరిగొప్పుల కనకయ్య, ప్రచార కార్యదర్శి : శనిగరం బిక్షపతి గౌరవ సలహాదారు ఇజ్జగిరి సిద్దయ్య, వృత్తి విభాగం అధ్యక్షులు తరిగొప్పుల నర్సింలు, ఉద్యోగ విభాగం నాంపల్లి కనకయ్య,ఇజ్జగిరి సిద్దయ్య ,శనిగరం చంద్రయ్య, శనిగరం నరసింహులు, మరియు యూత్ విభాగం అధ్యక్షులు వంగపల్లి సాయి తేజ్ ప్రధాన కార్యదర్శి కొన్నేప్రవీణ్, కోశాధికారి ,శనిగరం రమేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మద్దూర్ మండల అధ్యక్షులు శనిగరం కనకయ్య మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన జిల్లా కమిటీకి,మండల పరిధిలోని కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. మద్దూర్ మండలంలో కుమ్మర వృత్తి ఐక్యతకు,కులస్తుల సంక్షేమానికి, సంఘం అభివృద్ధికి ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామ కమిటీలు వేసి హక్కులను బాధ్యతలను నెరవేరుస్తానని తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.