విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్లో ఘనంగా ఫ్యూచర్ ఎక్స్–2026….విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మక ఆవిష్కరణలకు వేదిక
ఘట్కేసర్, నవంబర్ 28: ఘట్కేసర్లోని విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘విజ్ఞాన్స్ ఫ్యూచర్ ఎక్స్–2026’ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ ఘనంగా ముగిసింది. నవంబర్ 27, 28 తేదీల్లో నిర్వహించిన ఈ ప్రదర్శనలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ శాస్త్రీయ ఆలోచనలు, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఆర్డీఓకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కె. వీరబ్రహ్మం హాజరయ్యారు. అగ్ని-III క్షిపణి ప్రాజెక్టులో ఆయన చేసిన కృషి, బయోడీగ్రేడబుల్...