prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 9:44 am Digital Edition : upendar jerupothula JANAGON

లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసులు సహకరించాలి

 

జనగామ, నవంబర్ 28 (ప్రజావాణి): జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 12న జరుగు జాతీయ లోక్ అదాలత్ గురించి జనగామ జిల్లాలో ఉన్న పోలీసు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు.

జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్ పర్సన్, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శంకర శ్రీదేవి ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి శంకర శ్రీదేవి పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజీ పడదగిన క్రిమినల్ కాంపౌండ్ కేసులను త్వరగా పరిష్కరించుకునే విధంగా కోర్టుకు సహకరించాలని అన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్ కేసుల గురించి తెలుసుకొని పరిష్కార మార్గాలను సూచించారు. డిసెంబర్ 12 న జరుగు జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శితో పాటు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి జి.శశి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి కె.సందీప, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, స్టేషన్ ఘనపూర్, జనగామ ఇంచార్జి ఏసీపీ ఆర్.భీమ్ శర్మ, జిల్లా పరిధిలో ఉన్న సీఐలు, ఎస్ఐలు, పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.