రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలుడి కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ
బాలుడి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సీతక్క ఆరా.. కుటుంబ సభ్యులకు ధైర్యం మంగపేట, నవంబర్ 29 (ప్రజావాణి): మండలంలోని పాలైగూడెం గ్రామానికి చెందిన పోతుమర్తి సందీప్ కుమారుడు రుద్రాన్స్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులతో కలిసి బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. కమలాపురంలోని రోసా మిస్టికా కాన్వెంట్ హైస్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో స్కూల్ బస్సు దిగి తల్లితో కలిసి రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక లారీ ఢీకొనడంతో బాలుడు గాయపడ్డాడు. ఈ...