prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 11:05 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మీ ప్రజావాణిలో నేటి మాట

ఓ విలేకరి… జర భైలం!

సమాజం కళ్లు తెరిపించే కలం నీది. అన్యాయాన్ని ఎదిరించి ప్రజల పక్షాన నిలబడే బాధ్యత నీది.

ఒకప్పుడు విలేకరి అంటే సమాజంలో ఒక గౌరవం, ఒక భయం, ఒక నమ్మకం ఉండేది. కానీ నేడు ఆ విలువ ఎందుకు తగ్గుతోంది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో మిత్రమా!

రూ.500, రూ.1,000 రూపాయల కోసం ఆశపడి చేయి చాపితే ఆ క్షణం నీ కడుపు నిండొచ్చు. కానీ నిజాయితీగా పనిచేసే వందలాది మంది తోటి విలేకరుల ఆత్మగౌరవం మంటగలుస్తుంది.

నువ్వు చేసే ఒక్క తప్పు వల్ల నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడే అసలైన జర్నలిస్టులకు కూడా సమాజంలో విలువ లేకుండా పోతోంది.

కలం అనేది అమ్ముడుపోయే వస్తువు కాదు.. అది ప్రజల ఆయుధం.

ఆయుధాన్ని తాకట్టు పెడితే, ఇక ప్రజలకు రక్షణ ఏది?

నిజాయితీనే జర్నలిస్టుకు అసలైన ఆభరణం. ప్రజల గొంతుకగా నిలబడటమే విలేకరి నిజమైన బాధ్యత. కలం గౌరవాన్ని కాపాడుకుందాం.. జర్నలిజం విలువలను నిలబెడదాం.