prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 11:22 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మాదకద్రవ్యాలు మానవ మనుగడకే పెను ప్రమాదం -డాక్టర్ కొమ్ము జనార్ధన్

మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 29

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు, నషాముక్త భారత్ అభియాన్ లో భాగంగా..

హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి నిర్వహించిన *HYDERABAD WALKS FOR NASHAMUKTH BHARATH* పాదయాత్రలో భాగంగా పాల్గొన్న భాజపా మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ Dr కొప్పుల రాజశేఖరరెడ్డి,మరియు కో కన్వీనర్లు Dr రామకృష్ణ, Dr రష్మీ కండ్లికర్,Dr మురళీధర్ రెడ్డి, వుడ్ ల్యాండ్ హాస్పిటల్ అధినేత Dr సురేష్ గౌడ్ ,Dr స్వప్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా *మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ దంత వైద్యుడు,మెడికల్ సెల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ కొమ్ము జనార్దన్ మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని వాటి ఉచ్చులో పడకూడదని.. చెడు వ్యసనాలకు బానిసలై ఆర్థికంగా, ఆరోగ్యపరంగా,మానసికపరంగా, వచ్చేటటువంటి సమస్యలకు దూరంగా ఉండాలని, అలాగే దేహ దారుఢ్యాన్ని పెంచుకొనుటకు.. వాకింగ్, యోగ, ప్రాణాయామం ,ఆటలు మొదలగు శారీరక వ్యాయామాలను అలవాటు చేసుకోవాలని, సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను అబ్జర్వ్ చేస్తూ.. చెడు వ్యసనాలకు లోనైన యువతను..మార్చే విధంగా మోటివేట్ చేయాలని.. ఆ ఊబిలో పడకుండా,తమ చుట్టుపక్కల ఉన్న ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.