మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు పాటుపడాలి

మందమర్రి, నవంబర్ 29 (ప్రజావాణి): మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని అంబేద్కర్ ఆలోచనపరుల వేదిక నాయకులు జి చందర్, సుందిల్ల రాజయ్య లు తెలిపారు. శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వేదిక ఆధ్వర్యంలో పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనలోనే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త పూలే అని కొనియాడారు. తన భార్య సావిత్రి భాయి పూలే కు చదువు...