prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 3:21 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ డిపో మేనేజర కార్యక్రమం

 

బస్సు సర్వీసులు, సమయపాలన, ప్రయాణికుల సౌకర్యాలపై నేరుగా అభిప్రాయాలు తెలిపే అవకాశం

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 29:-

ప్రయాణికుల సమస్యలను తెలుసుకొని, ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ భైంసా డిపో ఆధ్వర్యంలో సోమవారం ‘డయల్ యువర్ డిపో మేనేజర్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నవంబర్ 30వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులు బస్సు సర్వీసులు, బస్సుల రాకపోకల సమయపాలన, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై తమ సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను నేరుగా భైంసా డిపో మేనేజర్‌ హరి హరి ప్రసాద్ కు తెలియజేయవచ్చు. ప్రయాణికుల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకొని ఆర్టీసీ సేవల నాణ్యతను పెంపొందించడంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు డిపో అధికారులు తెలిపారు. కావున భైంసా డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలు, సూచనలను తెలియజేయాలని అధికారులు కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9959226005 (భైంసా డిపో మేనేజర్).