పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు.. వారి విధానాలను ప్రతిఘటించాలి….ఘట్కేసర్లో సీపీఎం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతి
ఘట్కేసర్, నవంబర్ 28: సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం మహాత్మా జ్యోతిబా పూలే చేసిన కృషి ఆదర్శంగా నిలుస్తుందని, ఆయన ఆశయాలకు విరుద్ధంగా సాగుతున్న పాలకుల విధానాలను ప్రతిఘటించాలని సీపీఎం మండల కార్యదర్శి ఎన్. సబిత, సీనియర్ నాయకులు చింతల యాదయ్య పిలుపునిచ్చారు. శనివారం ఘట్కేసర్లోని సీఐటీయూ కార్యాలయంలో సీపీఎం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 136వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పూలే దంపతులు అందరికీ విద్య అందించాలనే...