నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రహదారి పనులను పరిశీలించిన కలెక్టర్, డీసీపీ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రహదారి విస్తరణ పనులు, ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. శనివారం, జిల్లాలోని లింగాల ఘనపురం మండలం, నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రహదారి విస్తరణ పనులను డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా నెల్లుట్ల బ్రిడ్జి వద్ద రహదారిపై ఏర్పడుతున్న బాటిల్ నెక్ సమస్యను పరిష్కరించేలా రహదారి విస్తరణ...