ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మందమర్రి, నవంబర్ 29 (ప్రజావాణి): మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ సేగ్యం వెంకటేష్ కోరారు. గురువారం గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని అమ్ముకొని, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తుందని సూచించారు. రాష్ట్రంలో రైతుల...