prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 11:55 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మందమర్రి, నవంబర్ 29 (ప్రజావాణి):

మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ సేగ్యం వెంకటేష్ కోరారు. గురువారం గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని అమ్ముకొని, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని, సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తుందని సూచించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సూదుల రాజేశ్వరి, సిసి చారి, సిఏ పవని, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.