prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 3:36 pm Digital Edition : RAJASHEKARREDDY

దీక్షా దివస్ సభకు తరలిన బెజ్జంకి మండలంలోనీ ఆయా గ్రామాల ప్రజలు

తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షా దివస్ 

బిఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి

బెజ్జంకి, నవంబర్ 29 (ప్రజావాణి):

అల్గునూరులో నిర్వహించిన దీక్షా దివస్ సభకు బెజ్జంకి మండలం నుంచి సుమారు 3 వేల మంది ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ అభిమానులు మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, మండల ఇంచార్జి చింతం సదానందం ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా దీక్షా దివస్ నిలుస్తుందని పాకాల మహిపాల్ రెడ్డి అన్నారు. KTR ముఖ్య అతిథిగా హాజరైన సభను విజయవంతం చేసేందుకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలివెళ్లారు