తెలంగాణ పోరాటాల చరిత్రను తవ్వితే జనగామే కనిపిస్తుంది..! పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 29 (ప్రజావాణి): తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు జనగామ గడ్డ కేంద్రబిందువుగా నిలిచిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ నాయకత్వం, ఆయన పోరాట పటిమ, రాజకీయ వ్యూహాలతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యశ్వంత్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి,...