తెలంగాణ కోసం ప్రాణాలిచ్చింది అమరవీరులు.. దోచుకుంది కేసీఆర్ కుటుంబం – శివరాజ్ యాదవ్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 29 (ప్రజావాణి): అందరూ పోరాడితే సోనియా గాంధీ దయతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైందని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ గురించి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా...