జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 29 (ప్రజావాణి): అందరూ పోరాడితే సోనియా గాంధీ దయతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైందని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు.
జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ గురించి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పచ్చి అబద్ధాలని, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
అప్పటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే పోరాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాడితేనే ఈ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేసుకోవాలని, ఉద్యమం సమయంలో పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్ట కోసం వెతికిన హరీష్ రావు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 1200 అమరవీరుల త్యాగఫలమే ఈరోజు వారు అనుభవిస్తున్న రాజభోగాలని, కేసీఆర్ కుటుంబ సభ్యులు మరియు హరీష్ రావు తమ 9 సంవత్సరాల పాలనలో ఎన్నో అక్రమాలు, కబ్జాలు చేసి అనేక అక్రమ సంపదలు సంపాదించుకున్నారని, కానీ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మాత్రం కన్నీటిని మిగిల్చారని విమర్శించారు.
తాను ప్రభుత్వంలోకి రాగానే ఎంత అక్రమ సంపాదన సంపాదించుకున్నాడో దమ్ము ధైర్యం ఉంటే జనగామ అంబేద్కర్ సాక్షిగా చెప్పగలవా అని హరీష్ రావును శివరాజ్ యాదవ్ డిమాండ్ చేశారు.
తొందర్లోనే కేసీఆర్ కుటుంబం మరియు హరీష్ రావు కుటుంబాల అక్రమ సంపాదన, అక్రమాలను ఒక్కొక్కటి బయటపెట్టి ప్రజల ముందు పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిర్గతం చేస్తారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట ప్రజలు హరీష్ రావును ఓడించి రాజకీయ సమాధి చేయడం ఖాయమని, ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలనే ఆకాంక్షతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.