జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 29 (ప్రజావాణి): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేశ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వంగాల కళ్యాణి మల్లారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కటకం ఉదయ్ కుమార్, లింగాల వెంకటేష్, కిషన్ నాయక్, మారపాక యాకయ్య, జనరల్ సెక్రటరీలు మంతెన కిష్టయ్య, బైరపాక యాదగిరి, జనగామ నియోజకవర్గ అధ్యక్షుడు బానోతు రామచంద్ర నాయక్, జిల్లా కోశాధికారి దాసరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నోరోజు నరసింహాచారి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆర్. ఉప్పలయ్య, జిల్లా కార్యదర్శి మోటే మల్లేష్, బ్లాక్ అధ్యక్షులు మొగ్గం కృష్ణంరాజు, గూగులోతు కృష్ణ నాయక్, పరిశరాములు, జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గోసంగి కిషన్, దండిగ ఐలయ్య, లింగాల ఘన్‌పూర్ మండల అధ్యక్షుడు చాదరబోయిన రాజు, రఘునాథపల్లి మండల అధ్యక్షుడు ఎల్లందుల అనిల్, చిల్పూర్ మండల అధ్యక్షుడు శ్రీధర్, పాలకుర్తి మండల అధ్యక్షుడు తాండ్ర కమలాకర్, జనగామ మండల అధ్యక్షుడు ఎస్. అనిల్, తరిగొప్పుల మండల అధ్యక్షుడు కొండ వేణు, స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ అధ్యక్షుడు మేకల మల్లేష్, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మహేంద్ర రెడ్డి, రఘునాథపల్లి మండల పార్టీ అధ్యక్షుడు, జనగామ జిల్లా సోషల్ మీడియా ప్రతినిధి దూపటి రాజు తదితరులు పాల్గొన్నారు.