మద్దూరు నవంబర్29, (ప్రజా వాణి) :
మండలంలోని బంజర గ్రామంలో జరుగుతున్న జలసిరి అభివృద్ధి పనులలో భాగంగా వాటర్ హార్వెస్టింగ్ ఫామ్ ఫండ్ పనులను మర్మాముల గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ తో కలిసి మద్దూరు మండలం ఎంపీడీవో శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలను సర్పంచ్ మరియు ఎంపీడీవో అభినందించారు.సర్పంచ్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు ఎలినినో ప్రభావం ఎండలకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో మంజుల, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి పాల్గొన్నారు.