prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 11:17 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు భోస్లే నారాయణ్ రావు పటేల్ ధన్యవాదాలు

 

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో ముధోల్, నవంబర్ 29:

తన జన్మదినం సందర్భంగా ప్రత్యక్షంగా, ఫోన్ ద్వారా, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జి భోస్లే నారాయణ్ రావు పటేల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపి తనపై చూపిన ప్రేమాభిమానాలు, ఆప్యాయతలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని పలువురు నాయకులు, కార్యకర్తలు స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందించారని పేర్కొన్నారు. తనపై చూపిన ఆదరణ, అభిమానాలు ఎంతో సంతోషాన్ని కలిగించాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా మీ అందరి ప్రేమాభిమానాలు, సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికీ మరోసారి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.