జనగామ మెడికల్ కాలేజ్ ప్రజా పోరాటాల ఫలితమే!
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు ఏ ఒక్క ప్రభుత్వం ఇచ్చిన కానుక కాదని, అది విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, జనగామ ప్రజలు చేసిన నిరంతర పోరాటాల ఫలితమని జనగామ జిల్లా జాక్ కన్వీనర్ మంగళంపల్లి రాజు అన్నారు. శనివారం సాయంత్రం బాణాపురంలోని ఒక కళాశాల ప్రాంగణంలో జనగామ జిల్లా జాక్ , సాదిక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “జనగామకు మెడికల్ కాలేజ్ ఎలా వచ్చింది?” అనే అంశంపై విద్యార్థులతో ప్రత్యేక...