జనగామ డీసీసీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలేకు ఘన నివాళులు
జనగామ జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, బహుజన అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు జాయ మల్లేష్, డీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ నరేందర్ పవార్ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా...