prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 1:40 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

   చిగురిస్తున్న ఆశలకు ఫలితం దక్కేనా…

చేర్యాల నియోజకవర్గ ఏర్పాటు జరిగెనా…?

మద్దూరు నవంబర్29, ప్రజావాణి :

ఏట్టకేలకు దేశ పార్లమెంటు సమావేశలలో నవంబర్ 30వ తేదీన ప్రవేశపెట్టే బిల్లులో భాగంగా మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు బిల్లలు చట్టరూపం దాల్చితాయనిది రాజకీయంగా చర్చ సాగుతున్న సందర్భానుగాను వివిధ పార్టీల వైఖరి భిన్నంగా ఉన్నప్పటికీ ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రాబల్యం హెచ్చుతగ్గులు ఏర్పడతాయని భావిస్తున్నప్పటికీ, అధికార పక్షం సరైన బలం లేకపోయినా, మిగతా మిత్ర భాగస్వామ్య పార్టీల పక్షాలతో ఓటింగ్ వేయుంచుకొని బిల్లును పాస్ చేయించుకునే పనిలో మోడీ, అమిత్ షా ఉన్నారు. ఏది ఏమైనా మెజార్టీ రాజకీయ పార్టీలు ప్రజలు విషయాన్ని స్వాగతిస్తున్న విషయం విదితమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చేసిన నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన బలంగా వినిపిస్తుంది. అందువల్ల అసెంబ్లీ స్థానాల సంఖ్య కు 50 శాతంతో కూడిన సీట్లను పెంచే ప్రతిపాదన ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. మన రాష్ట్రంలో 119 స్థానాలకు గాను 182 కు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పార్లమెంటు స్థానాలు 17 నుండి 26 వరకు పెరిగే అవకాశం పెరగవచ్చని అంచనా,దీంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం బావ సారూప్యం మారిపోయే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు తారుమారు చేసే అవకాశం లేకపోలేదు. కావున ఈ డిలిమిటేషన్ బిల్లు ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలో నియోజకవర్గాల ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందనే ప్రచారం జరుగుతుంది.కానీ 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలుగా చేసినప్పటికీ ఉమ్మడి పది జిల్లాల ప్రాతిపదికన జరిగితే చేర్యాల పాత నియోజకవర్గం పునరుద్ధరణ జరిగేనా.. కొత్త జిల్లాల ప్రాతిపదికన జరిగితే నియోజకవర్గం ఒక ప్రశ్నగా మారినుండా..?? ఒకనాడు అసెంబ్లీగా వెలుగొందిన చేర్యాల నేడు కనుమరుగై నేటికీ అంధకారం వైపు సాగుతుంది. నాటి జిల్లాల పునర్వ్యవస్థీకరణలో తమ ఉనికిని కోల్పోయి, జనగామ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న చేర్యాలను అసస్త్రీయంగా విభజించడం జరిగింది. దీంతో ప్రజల కష్టాలు విపరీతంగా పెరిగినవి. కావున త్వరలో జరగబోయే నియోజకవర్గం పెంపు ప్రక్రియలో ప్రజలంతా ఒక్కటి కావాలి. చేర్యాల పాత నియోజకవర్గము సాధించడానికి ముందుకు రావాలి.రాజకీయలు ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయని భావించాలి. ప్రజల వినతులు ప్రభుత్వ దృష్టికి పోవాలి.ఇక్కడి సామాజిక పరిస్థితి, జనాభా, వనరులు, గత చారిత్రక వైభవం, భౌగోళిక పరిస్థితులు, నైసర్గికం విస్తరణ, తాజా రాజకీయ పరిణామాలపై గత వర్తమాన రాజకీయాలపై సమలాలోచనలు జరగాలి. సమగ్ర విచారణ జరిగే విదంగా చూడాలి. ప్రభుత్వ పరిధిలోకి వెళ్లాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే బిల్లు విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాల నుండి 18 స్థానాలకు ఏర్పాటు కావచ్చనే ప్రచార నేపథ్యంలో, మన చేర్యాలను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలనే కృషిలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి. మన ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఆత్మగౌరవం కోసం నిలబడాలి. నియోజకవర్గం సాధించాలి.