prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 11:12 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఘనంగా”ఆర్యవైశ్య సంఘం”ప్రమాణ స్వీకారం..

ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల నూతన ఆర్యవైశ్య సంఘం

స్థానిక శివాలయంలో వెన్నాకుల శ్రీను అధ్యక్షతన వైభవోపేతంగా ప్రమాణస్వీకారం చేశారు. దీనికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరి గౌరీ శంకర్,ఏవో ఏవి ఓ పి ఎ వేముల బాబ్జి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తల్లాడ వెంకట రామారావు,సామ రామమూర్తి హాజరయ్యారు.సంఘం నూతన కమిటీ చే ముఖ్య అతిథులు ప్రమాణ స్వీకారం చేయించారు.సంఘం మండల అధ్యక్షులుగా నెల్లికుదురుకు చెందిన సీనియర్ నాయకులు వెన్నాకుల ఉపేందర్,ప్రధాన కార్యదర్శి గా మునిగల వీడు యువ నేత, పరోపకారి మాశెట్టి నవీన్ కుమార్,కోశాధికారిగా బచ్చు నాగేశ్వర్ రావు, గౌరవాధ్యక్షులు వెన్నాకుల శ్రీను,ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్,మనోహర్, సహాయ కార్యదర్శిలు సి.హెచ్ రమేష్,వీరన్న, సోమయ్య తో సహా కార్యవర్గ సభ్యులు ఆర్యవైశ్యుల ఇలవేల్పు కన్యకా పరమేశ్వరి సాక్షిగా ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.

నెల్లికుదురు ఆర్యవైశ్యులు భేష్: గౌరీ శంకర్

రాష్ట్రంలోనే నెల్లికుదురు ఆర్యవైశ్యులు అన్ని కార్యక్రమాలలో చురుగ్గా ఉంటూ ముందుకు సాగుతున్నారని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరీ శంకర్ అభినందించారు.సంఘం భవనానికి బాబ్జి భూ దానం చేయడాన్ని కొనియాడారు.18 సం.లు నిండిన ఆర్యవైశ్య యువతి,యువకులు సభ్యత్వం తీసుకోవాలన్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఉపేందర్

ఆర్యవైశ్యుల హక్కులు,సమస్యల కోసం అందరితో కలిసి కృషి చేస్తానని సంఘం నూతన అధ్యక్షులు వెన్నాకుల ఉపేందర్ స్పష్టం చేశారు. సంఘం అభివృద్ధికి శ్రమిస్తానని ప్రకటించారు.నూతన కమిటీ ఎంపికకు సహకరించిన మండల ఆర్య వైశ్య సామాజిక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

సామూహిక వ్రతాలు,మహాన్న ప్రసాద వితరణ..

మండల నూతన ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం అనంతరం సంఘం ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహాన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కొమురవెల్లి కృష్ణమూర్తి,మాశెట్టి వెంకన్న,చింత సత్యనారాయణ,మహేష్,సతీష్,శంకర్, వివిధ గ్రామాల ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.