prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 November 2026, 8:02 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

కన్నాయిగూడెంలో ఎగిరిన ఎర్రజెండా 

కన్నాయిగూడెం సర్పంచ్‌గా పెనుబల్లి వెంకటమ్మ గారు ఘన విజయం!

182 ఓట్ల మెజార్టీతో విజయకేతనం

వైసీపీ బలపరిచిన సీపీఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వెంకటమ్మగారు

మన ప్రజావాణి | ఎటపాక మండలం:(29నవంబర్ )

ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన సీపీఎం పార్టీ అభ్యర్థి పెనుబల్లి వెంకటమ్మ గారు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 182 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయంతో కన్నాయిగూడెం గ్రామంలో ఆమె మద్దతుదారులు, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి, ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పెనుబల్లి వెంకటమ్మ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు. కన్నాయిగూడెం గ్రామ ప్రజల తీర్పుతో పెనుబల్లి వెంకటమ్మ విజయఢంకా మోగించారు.