అనారోగ్యంతో బాధపడుతున్న కల్లుగీత కార్మిక సంఘం నేతను పరామర్శించిన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 29 : గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం (కేజీకేఎస్) నర్సింహులపేట మండల మాజీ ప్రధాన కార్యదర్శి గాడిపెల్లి రవీందర్‌ను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పరామర్శించారు. నర్సింహులపేట మండల కేంద్రంలోని ఆయన నివాసానికి వెళ్లిన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌ను ఆప్యాయంగా పలకరించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు ధైర్యం...